లాల్‌ సలామ్‌ కామ్రేడ్‌..

– ఎన్‌. శంకరయ్యకు కన్నీటి వీడ్కోలు
– అంతిమయాత్రలో అశేష జనవాహిని
– సీతారాం ఏచూరి, ప్రకాశ్‌ కరత్‌ నివాళి
– ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశ పోరాట చరిత్రలో అగ్రగామిగా శతాబ్ది ప్రజ్వలన చేసిన కామ్రేడ్‌ ఎన్‌. శంకరయ్యకు అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. తమిళ రాజకీయాల్లో సీపీఐ(ఎం) చిహ్నంగా నిలిచిన నాయకుడికి వీడ్కోలు పలికేందుకు దేశం మొత్తం చెన్నైకి తరలివచ్చింది. గుండెను పిండేసే బాధను సైతం లెక్కచేయకుండా పిడికిలి బిగించి తమ ప్రియతమ సహచరుడికి సెల్యూట్‌ చేశారు. చెన్నైలోని టి నగర్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ కార్యాలయం (పి.రామమూర్తి భవన్‌), దాని పరిసరాలు తమిళనాడులోని మారుమూల గ్రామాల నుంచి చిన్నారులు, మొద లుకుని వృద్ధుల వరకు రావటంతో..కిక్కిరిసిపోయాయి. తమ ప్రియతమ నేత ను కడసారి చూసేందుకు ప్రజలు, కార్యకర్తలు తండోపతండాలుగా వచ్చారు. తమ నేత భౌతికంగా లేకపోవడాన్ని జీర్ణించుకోలేక అనేక మంది కన్నీరు మున్నీ రయ్యారు. భౌతికకాయాన్ని పి. రామమూర్తి స్మారకం వద్దకు తీసుకెళ్లారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌, రామకృషన్‌, కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్‌, అఖిల భారత కిసాన్‌ సభ అధ్యక్షుడు అశోక్‌ ధావలే, ఐద్వా అధ్యక్షురాలు పీకే శ్రీమతి, సీపీఎం కేరళ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పీకే బిజు, డీవైఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుడు ఎఎ రహీమ్‌, సినీ నటులు పార్తీపన్‌, సత్యరాజ్‌, సినీనటి రోహిణి తదితరులు కూడా నివాళులర్పించారు. అంతకు ముందు అంతిమ యాత్ర కొనసాగింది. యాత్ర అగ్రభాగంలో సీతారాం ఏచూరి, ప్రకాశ్‌ కరత్‌, కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ ఎ.రాజా, సీపీఐ(ఎం) నేతలు ఉన్నారు. 1.5 కిలో మీటర్‌ పొడవున యాత్ర కొనసాగింది. బసంత్‌ నగర్‌ స్మశానవాటికకు చేరు కున్న తరువాత, అక్కడ సంతాప సభ జరిగింది. సీపీఐ(ఎం) నేతలు సీతారాం ఏచూరి, ప్రకాశ్‌ కరత్‌, అశోక్‌ దావలేతో పాటు డీఎంకే ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ ఆర్‌.ఎస్‌ భారతి, పెరియర్‌ సంఘం నేత కె. వీరమణి, సీపీఐ సహాయ కార్య దర్శి పెరియర్‌ స్వామి, సీనియర్‌ జర్నలిస్టు ఎన్‌.రామ్‌, ఎండిఎంకె ఎంపీ వైగో, వీసీకే ఎంపీ తిరుమవలవన్‌ పాల్గొన్నారు. ఎన్‌. శంకరయ్య పోరాటాలను గుర్తు చేసుకున్నారు. స్వాతంత్య్ర పోరాటం నుంచి, కమ్యూనిస్టు ఉద్యమం, కులవ్యతి రేక, అంటరానితనం వ్యతిరేక పోరాటాలు, సంస్కరణోద్యమాలు గురించి వివరించారు. అనంతరం ప్రభుత్వలాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించారు.

Spread the love