Saturday, May 24, 2025
Homeరాష్ట్రీయంవిపక్ష నేతల నిర్బంధం

విపక్ష నేతల నిర్బంధం

- Advertisement -

సీపీఐ(ఎం), బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకుల అరెస్టులు
నిమ్జ్‌ రైతుల్ని లాక్కెళ్లిన పోలీసులు, తిరగబడ్డ మహిళలు
గుమ్మడిదలలో జేఏసీ నాయకుల అరెస్టు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి/జహీరాబాద్‌
సీఎం రేవంత్‌రెడ్డి సంగారెడ్డి జహీరాబాద్‌ నియోజకవర్గాల పర్యటన నేపథ్యంలో విపక్ష నేతలను నిర్బంధించారు. తెల్లవారు జాము 3 గంటల నుంచే నిమ్జ్‌, డంపింగ్‌యార్డ్‌ నిర్వాసితులను ఇండ్లల్లోంచి తీసుకెళ్లి నిర్బంధించారు. సీపీఐ(ఎం) నాయకుల్ని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లలో పొద్దస్తం ఉంచారు. మరి కొందర్ని గృహ నిర్బంధంలో ఉంచారు. బీఆర్‌ఎస్‌, బీజేపీకి చెందిన వాళ్లను కూడా అక్కడక్కడ ముందస్తు అరెస్టు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో జహీరాబాద్‌కు వచ్చిన సీఎం నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. ఈ పేరుతో జహీరాబాద్‌ నియోజకవర్గమంతటా సీపీఐ(ఎం) నాయకుల్ని అరెస్టు చేశారు. న్యాల్కల్‌ మండలంలోని మామిడ్గి గ్రామానికి చెందిన రైతులు నిమ్జ్‌ ఏర్పాటుకు తమ సారవంతమైన భూములను ఇవ్వబోమని, నిర్వాసితులకు ఇంకా అందాల్సిన బెనిఫిట్స్‌పై ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని ఇస్తామని ప్రకటించడంతో గ్రామం మొత్తాన్ని పోలీసులు దిగ్బంధంలోకి తీసుకున్నారు. సీపీఐ(ఎం) నాయకుల్ని, రైతుల్ని తెల్లవారుజామున 3 గంటలకే పూట అరెస్టు చేసి వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. దాంతో గ్రామంలోని మహిళలు తిరగబడ్డారు. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదే విధంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, సంగారెడ్డి ఏరియా కార్యదర్శి ఎం.యాదగిరిని సైతం ముందస్తు అరెస్టు చేశారు. రాంకీ సంస్థ, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న డంపింగ్‌ యార్డ్‌కు వ్యతిరేకంగా వంద రోజులకుపైగా పోరాడుతున్న గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి, కొత్తపల్లి ప్రాంతాల్లోని జేఏసీ నాయకులు, రైతులు, మహిళల్ని సైతం ముందస్తు అరెస్టు చేసి దీక్షలు కొనసాగకుండా అడ్డుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -