Thursday, January 22, 2026
E-PAPER
Homeక్రైమ్ఘోర బస్సు ప్రమాదం.... బస్సు, లారీ దగ్దం... ముగ్గురు మృతి

ఘోర బస్సు ప్రమాదం…. బస్సు, లారీ దగ్దం… ముగ్గురు మృతి

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్ : అర్ధరాత్రి సమయం.. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రయివేటు ట్రావెల్స్ బస్సు టైరు పేలడంతో అదుపుతప్పింది.. డివైడర్ మీదుగా దూసుకెళ్లి రోడ్డు అవతలివైపు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు తోపాటు లారీ కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లినర్ ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు… నెల్లూరు నుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వస్తున్న ఓ ఏఆర్బీసీవీఆర్ ప్రయివేటు ట్రావెల్స్ బస్సు బుధవారం అర్ధరాత్రి 2 గంటలు దాటా నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట వద్ద ప్రమాదానికి గురైంది. టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తోపాటు లారీ డ్రైవర్, క్లీనర్ మృతిచెందారు. వారి మృతదేహాలు గుర్తుపట్టి లేనంతగా కాలిపోయాయి.

ప్రమాదం జరిగిన తర్వాత బస్సుకు మంటలు వ్యాపించాయి. ఆ దారిన వెళ్తున్న డీసీఎం డ్రైవర్ వాహనాన్ని ఆపి బస్సు అద్దాలను పగులగొట్టడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. కిటికీల్లోంచి దూకేయడంతో పదుల సంఖ్యలో ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ప్రయాణికుల లాగేజీ పూర్తిగా కాలిపోయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -