- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. జనవరి 24న నాలుగో శనివారం, 25న ఆదివారం సెలవులు ఉండగా, 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు. ఇక 27న వారానికి ఐదు పని దినాలు అమలు చేయాలనే డిమాండ్‌తో బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో నాలుగు రోజులు బ్యాంకు శాఖలు పనిచేయవు. అయితే ఈ సమయంలో డిజిటల్ లావాదేవీలు, ఏటీఎం సేవలు సాధారణంగానే కొనసాగుతాయి. అత్యవసర బ్యాంక్ పనులుంటే ముందుగానే ప్లాన్ చేసుకోవడం బెటర్.
- Advertisement -



