– పుత్తూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ‘జగన్నాథ్` యూనిట్ సందడి…ట్రైలర్ లాంచ్
నవతెలంగాణ పుత్తూరు:
రెండు తెలుగు రాష్ట్రాల్లో జనవరి 30న విడుదల కానున్న ‘జగన్నాథ్` సినిమాను యువత, విద్యార్థులు సహా ప్రతి ఒక్కరూ ఆదరించి విజయవంతం చేయాలని ఆ సినిమా హీరో రాయలసీమ భరత్ కోరారు. బుధవారం పుత్తూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో జగన్నాథ్ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో రాయలసీమ భరత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రేక్షకుల ఆదరణే తమకు అతిపెద్ద బలం అని అన్నారు. నూతన నటీనటులతో, వెండితెరకు పరిచయమవుతున్నామని తెలిపారు. తమ సినిమా యువతను ఆకట్టుకుంటుందని, సినీ ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.


ఈ కార్యక్రమంలో సిద్ధార్థ కళాశాల చైర్మన్ హీరో పులివెందుల మహేష్, యూత్ ఐకాన్ వినయ్ కుమార్, ప్రముఖ యూట్యూబర్లు ఫరూక్, రేష్మ, కవిత, జగన్నాథ్ సినిమా కో-ప్రొడ్యూసర్లు చైతన్య, వెంకటేష్ పాల్గొని సినిమా ట్రైలర్‌ను వీక్షించి, సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
సినిమా వివరాలు:
సినిమా పేరు: జగన్నాథ్
హీరో: రాయలసీమ భరత్
హీరోయిన్లు: సారా, నిత్యశ్రీ, ప్రీతి రెడ్డి
దర్శకులు: సంతోష్ & భరత్
బ్యానర్: భరత్ ఫిలిం ఫ్యాక్టరీ
విడుదల తేదీ: జనవరి 30
యూత్‌ఫుల్ యాక్షన్, భావోద్వేగాలతో రూపొందిన జగన్నాథ్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం విశ్వాసం వ్యక్తం చేసింది.




