నవతెలంగాణ – వీర్నపల్లి
సామాజిక సేవా కార్యక్రమాల్లో తామున్నామంటూ వీర్నపల్లి మండలం వన్ పల్లి గ్రామ సర్పంచ్ తాడగొండ సాయిలు తన ఉదారతను చాటుకున్నారు. సేవా భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓల్డ్ ఏజ్ హోమ్ (వృద్ధాశ్రమం) నిర్వహణ కోసం ఆయన రూ.10 వేల ఫౌండేషన్ సభ్యులకు ఈ విరాళాన్ని నగదు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వయసు మళ్ళిన వృద్ధులకు ఆసరాగా నిలుస్తున్న సేవా భారత్ ఫౌండేషన్ వంటి సంస్థలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. నిరుపేదలకు, వృద్ధులకు సేవ చేయడం సంతృప్తినిస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా భారత్ ఫౌండేషన్ సభ్యులు, గ్రామ నాయకులు, ఇతరులు పాల్గొన్నారు. సర్పంచ్ చేసిన ఈ ఆర్థిక సాయాన్ని ఫౌండేషన్ సభ్యులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.
సేవా భారత్ ఫౌండేషన్‌కు సర్పంచ్ విరాళం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



