Thursday, January 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫార్మర్ రిజిస్ట్రీపై అనాసక్తి.!

ఫార్మర్ రిజిస్ట్రీపై అనాసక్తి.!

- Advertisement -

మండలవ్యాప్తంగా 9,653 పట్టాదారు పాస్ పుస్తకాలు
ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసింది 4,485
నవతెలంగాణ – మల్హర్ రావు

వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గతేడాది మే 6వ తేదీన చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండలంలో నత్తనడకన సాగుతోంది. మండల వ్యాప్తంగా 96,53 మంది రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉండగా ఇప్పటివరకు 4,485 మంది రైతులు మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఇంకా 5,168 మంది రైతులు పార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ప్రారంభమై 8 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు 46.72 శాతం పట్టాదార్ పాసుబుక్కులు కలిగిన రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోగా..ఇంకా సగం మంది కూడా నమోదు చేసుకోలేదు.అదేవిధంగా అందులో మండల వ్యాప్తంగా 5,678 మంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి అర్హులుగా ఉండగా.. కేవలం 2,678 మంది రైతులు (44.8 శాతం) రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారు.

కేంద్ర పథకాలకు యూనిక్ నంబర్ తప్పనిసరి
ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక విశిష్ట సంఖ్య కేటాయించి గుర్తింపు కార్డు ఇవ్వనుంది. ఇందులో 11 అంకెల యూనిక్ ఐడీ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డులు, ఫసల్ బీమా తదితర పథకాలు వర్తించాలంటే రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. భవిష్యత్లో ఎరువుల పంపిణీ కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు ఉండనుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. గత నెల వరకు ఫార్మర్ రిజిస్ట్రేషన్లువ్యవసాయ విస్తరణ అధికారులే తమ మొబైల్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం మీ సేవ కేంద్రాల్లో కూడా ఫార్మర్ రిజిస్ట్రే షన్ చేసే వెసులుబాటు కల్పించింది.

ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఇలా..
రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏఈఓల ద్వారాగాని, మీ సేవ కేంద్రాల్లో గాని రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఇందు కోసం ఆధార్కార్డుతో పాటు ఆధార్కు లింక్ అయిన మొబైల్ను తీసుకె ళ్లాలి. ఫోన్కు 3 సార్లు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. 11 అంకెలతో కూడిన యూనిక్ ఐడీ వస్తుంది.

అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: శ్రీజ..ఏఓ
పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న రైతులు తప్పనిసరిగా పార్మర్ రిజిస్ట్రీ తప్పకుండా చేసుకోవాలి. ప్రభుత్వాలు అమలు చేసే పథకాలకు పార్మర్ యునిక్ ఐడి కార్డు తప్పనిసరి. రైతులు ఏఈఓల వద్ద కానీ,తమ సమీప  మిసేవా కేంద్రాల్లో గాని విదిగా పార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -