నవతెలంగాణ-హైదరాబాద్: బోర్డు ఆప్ గాజా పీస్‌లో చేరబోమని చైనా స్పష్టం చేసింది. పీస్ చర్చలలో భాగస్వామ్యం కావాలని యూఎస్ నుంచి ఆహ్వానం అందిందని, కానీ ఐక్యరాజ్యసమితి ప్రధానాంశంగా అంతర్జాతీయ వ్యవస్థను పరిరక్షించడానికి దృఢంగా బీజింగ్ కట్టుబడి ఉందని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొంది.
చైనా ఎల్లప్పుడూ నిజమైన బహుపాక్షికతను పాటిస్తుందని, UN దాని ప్రధాన భాగంలో ఉన్న అంతర్జాతీయ వ్యవస్థను, అంతర్జాతీయ చట్టంపై ఆధారపడిన అంతర్జాతీయ క్రమాన్ని, UN చార్టర్ ప్రయోజనాలు, సూత్రాల ఆధారంగా అంతర్జాతీయ సంబంధాలను నియంత్రించే ప్రాథమిక నిబంధనలను పరిరక్షించడానికి చైనా గట్టిగా కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇజ్రాయిల్-గాజాలో యుద్ధం ముగింపు అనంతరం ట్రంప్ గత సెప్టెంబర్‌లో శాంతి మండలిని ప్రతిపాదించారు. ఈక్రమంలోనే బోర్డు ఆప్ పీస్‌లో భాగస్వామ్యం కావాలని అనేక దేశాలకు ట్రంప్ ఆహ్వన లేఖలు పంపించారు. బోర్డులో చేరడానికి ఇప్పటికి 25 దేశాలు అంగీకరించాయి. ట్రంప్ ఆహ్వానాన్ని అంగీకరించిన దేశాలలో ఇజ్రాయెల్, కొసావో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హంగేరీ, బెలారస్, అజర్‌బైజాన్, ఈజిప్ట్, అర్మేనియా, టర్కీ, పాకిస్తాన్, ఖతార్ మరియు జోర్డాన్ తదితర దేశాలున్నాయి.



