నవతెలంగాణ-హైదరాబాద్: జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో ఆర్మీ వాహనం(Army Vehicle) లోయలో పడిపోయింది. ఆ ఘటనలో 10 మంది జవాన్లు మరణించగా, మరో 9 మంది గాయపడ్డారు. బందేర్వా-చంబా హైవేపై ఉన్న ఖన్ని టాప్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బుల్లెట్ ప్రూఫ్ ఆర్మీ వాహనంలో సుమారు 17 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నారు.
ఆర్మీ వాహనం హై ఆల్టిట్యూడ్ పోస్టు వద్దకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోయారు. సుమారు 200 ఫీట్ల లోతులో ఆ వెహికిల్ పడిపోయింది. ఆర్మీతో పాటు పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. నలుగురు సైనికులు మృతిచెందినట్లు గుర్తించామన్నారు. గాయపడ్డవారిలో కొందర్ని ఉదంపూర్ మిలిటరీ ఆస్పత్రిలో చేర్పించారు.



