- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కి నోటీసులు ఇచ్చింది సిట్. రేపు విచారణకి రావాలని ఆదేశించింది. ఉదయం 11 గంటలకు విచారణకి రావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్. గత రెండ్రోజుల కిందట మాజీ మంత్రి హరీష్‌రావును సిట్ అధికారులు 7 గంటలపాటు విచారించారు.
- Advertisement -



