నవతెలంగాణ-హైదరాబాద్: రాబోయే టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం తమ జట్టును భారత్‌కు పంపించబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధికారికంగా ప్రకటించింది. ఇవాళ జరిగిన అంతర్గత సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీబీ వెల్లడించింది.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం బుల్బుల్ మాట్లాడుతూ.. మేం వరల్డ్‌కప్ ఆడాలని కోరుకుంటున్నాం.. కానీ భారత్‌లో మాత్రం ఆడబోం.. ఈ విషయంపై ఐసీసీతో మా చర్చలు కొనసాగుతాయి.. ఐసీసీ బోర్డు సమావేశంలో కొన్ని షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే, మా మ్యాచ్‌లను భారత్ బయట నిర్వహించాలన్న మా అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది.. ప్రపంచ క్రికెట్ పరిస్థితి ఏ దిశగా వెళ్తుందో అర్థం కావడం లేదని బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు బుల్బుల్ పేర్కొన్నారు.
కాగా, బుధవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బీసీబీ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించగా, టోర్నీలో పాల్గొనకపోతే స్కాట్లాండ్‌ను ప్రత్యామ్నాయ జట్టుగా ఎంపిక చేస్తామని ఐసీసీ తేల్చి చెప్పింది. ఈ టోర్నీ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.



