నవతెలంగాణ-హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని బలోడా బజార్-భటపారా జిల్లాలో గురువారం పెను విషాదం చోటుచేసుకుంది. ఓ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలో సంభవించిన భారీ పేలుడుకు ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 10 మంది తీవ్ర గాయాలపాలైనట్లు ప్రాథమిక సమాచారం.
భారీ ప్రమాదం జరిగిందన్న సమాచారం అందగానే పోలీసులు, జిల్లా సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాయి. మంటలను అదుపులోకి తేవడంతో పాటు, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాల లోపం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా అధికారులు విచారణ చేస్తున్నారు.



