Thursday, January 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐకేపీ మండల మహిళా సమాఖ్య సమావేశం

ఐకేపీ మండల మహిళా సమాఖ్య సమావేశం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య ఐకెపి కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు ఏపీఎం జగదీష్ కుమార్ తెలిపారు. మండల మహిళా సమాఖ ఐకెపి ఈ పనితీరు ఏ విధంగా జరుగుతుందో తెలుసుకోవడానికి సీనియర్ సి.ఆర్.పి లు పి.శ్రీలత మరియు సీహెచ్ అనూరాధ హాజరైనట్లు ఆయన తెలిపారు. వీరు రెండురోజుల పాటు శిక్షణ ఇస్తారు. మొదటిరోజు మండల సమాఖ్య సమావేశం జరుగుతున్న తీరును పరిశీలిస్తారు, రెండవ రోజున మొదటి రోజూ సమావేశంలో గమనించిన అంశాల పైన శిక్షణ ఇస్తారు.

ఇందులో వారు సమావేశంలో కూర్చునే విధానము, అజెండాలో ఉండే అంశాలు, సబ్ కమిటీల ఏర్పాటు, బ్యాంక్ లింకేజ్, స్త్రీ నిది బకాయిల రికవరీ లో  కమిటీల పాత్ర గురించి శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమంలో  మండల సమాఖ్య అధ్యక్షురాలు రేణుక, కార్యదర్శి సవిత, కోశాధికారి లక్ష్మి, వివిధ గ్రామ సంఘాల అధ్యక్షులు, ఐకేపీ ఏ పి యమ్ జగదీష్ కుమార్, సీసీ లు రాములు, సంగీత, రాజశ్రీ, సుమిత్ర, అనిల్  మండల సమాఖ్య అకౌంటెంట్ నర్సింగ్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -