అడ్డుకున్న యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు
వెనక్కి తగ్గిన ట్రంప్
సుంకాలు విధించడం లేదంటూ ప్రకటన
స్ట్రాస్‌బర్గ్ (ఫ్రాన్స్) : అమెరికా-ఈయూ వాణిజ్య ఒప్పందానికి యూరోపియన్ పార్లమెంట్ సభ్యుల కీలక బృందం ‘నో’ చెప్పింది. ఈ ఒప్పందం ధృవీకరణ కోసం యూరోపియన్ పార్లమెంటులో జరిగిన ఓటింగ్‌ను పలు దేశాలు అడ్డుకున్నాయి. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న తన లక్ష్యాన్ని వ్యతిరేకించే దేశాలపై అదనంగా 35 శాతం సుంకాలు విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరిక నేపథ్యంలో ఆయా దేశాల ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నారు. యూరోపియన్ పార్లమెంటులో తన చర్యలపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో ట్రంప్ వెనకడుగు వేశారు. సుంకాల హెచ్చరికను వెనక్కి తీసుకున్నారు. ‘నాటో సెక్రెటరీ జనరల్ మార్క్ రట్‌తో ఫలప్రదమైన సమావేశం జరిగింది. గ్రీన్‌లాండ్ పైన..వాస్తవానికి మొత్తం ఆర్కిటిక్ ప్రాంతంపై భవిష్యత్తులో కుదుర్చుకునే ఒప్పందంపై మేము ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాం.
ఈ అవగాహన ఆధారంగా…ఫిబ్రవరి 1వ తేదీన అమలులోకి రావాల్సిన సుంకాలను నేను విధించడం లేదు’ అని ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు. కాగా గ్రీన్‌లాండ్‌లో చైనా, రష్యాలు ఆర్థిక, సైనిక ప్రయోజనాలు పొందకుండా చూడడమే ఈ ఫ్రేమ్‌వర్క్ ఉద్దేశమని వార్తలు వస్తున్నాయి. ట్రంప్ తాజా నిర్ణయం నేపథ్యంలో అమెరికా-ఈయూ వాణిజ్య ఒప్పందంపై యూరోపియన్ నేతల వైఖరేమిటో తెలియడం లేదు. ఒప్పందాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారా లేక అందులోని కొన్ని భాగాలను వ్యతిరేకించి మిగిలిన దానికి ఆమోదం తెలుపుతారా అనే దానిపై కూడా స్పష్టత రాలేదు. గత వేసవిలో కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రకారం…యూరోపియన్ యూనియన్ వస్తువులపై విధించే సుంకాన్ని అమెరికా 15 శాతానికి పరిమితం చేస్తుంది. అమెరికా ఉత్పత్తులపై యూరోపియన్ దేశాలు సుంకాలేవీ విధించవు.
అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



