Friday, January 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబిల్లులు చెల్లించాలని పాఠశాల గదులకు తాళం

బిల్లులు చెల్లించాలని పాఠశాల గదులకు తాళం

- Advertisement -

రూ.కోటి 80లక్షలు బకాయి పట్ల కాంట్రాక్టర్‌ ఆందోళన

నవతెలంగాణ-అచ్చంపేట
మన ఊరు-మనబడి పథకం కింద పాఠశాలలో నిర్మించిన అదనపు గదులకు సంబంధించి బిల్లులు ఇవ్వడం లేదని కాంట్రాక్టర్‌ గురువారం తాళాలు వేసి నిరసన తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని నడింపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.40లక్షలు ఖర్చు చేసి డైనింగ్‌ హాలు, అదనపు గదుల నిర్మాణాలను కాంట్రాక్టర్‌ శేఖర్‌ పూర్తి చేశాడు. ఇప్పటికీ బిల్లులు రాకపోవడంతో అదనపు గదులకు తాళం వేశాడు. 2022-23లో అచ్చంపేట బాలికల హైస్కూల్‌ నిర్మాణానికి రూ.95లక్షలు, ఆశ్రమ పాఠశాల భవనాల నిర్మాణానికి రూ.25లక్షలు, అయ్యవారిపల్లి పాఠశాలలో రూ.32లక్షల పనులను కాంట్రాక్టర్‌ చేశారు. బిల్లులు బకాయిలు ఉండటంతో ఆర్థికంగా అప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాంట్రాక్టర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తమ పరిస్థితిని అర్థం చేసుకొని జిల్లా కలెక్టర్‌ నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -