- Advertisement -
సీఎస్‌కు తపస్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
317 జీవో బాధిత ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించేలా జీవో 190ని పూర్తిగా అమలు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యయ సంఘం (తపస్) కోరింది. ఈ మేరకు గురువారం తపస్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి వొద్నాల రాజశేఖర్, తెల్కలపల్లి పెంటయ్య, ఆర్గనైజింగ్ సెక్రెటరీ హన్మంత్ రావులు సీఎస్ కె.రామకృష్ణారావుకు వినతిపత్రం సమర్పించారు. జీవో 25తో ముడిపెట్టొద్దని కోరారు. స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయుల పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
- Advertisement -



