ఎలక్షన్ కమిషన్ కో-ఆర్డినేషన్ కమిటీతో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షున్ని సంప్రదించి ప్రతి జిల్లాలో ఇద్దరు లేదా ముగ్గురు ప్రతినిధులను నియమించాలని ఎలక్షన్ కమిషన్ కో-ఆర్డినేషన్ కమిటీని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కో ఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు పులిపాటి రాజేశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని దిశా నిర్దేశం చేశారు. రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కమిటీది కీలక బాధ్యత ఉంటుందని గుర్తుచేశారు. ఎప్పటికప్పుడు ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకోవాలని కోరారు. ఈ సమావేశానికి కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు ఎస్.జగదీశ్వర్, తనీర్ నరేందర్, కాచే శశి భూషణ్, రాఘవేందర్ గోపిశెట్టి, కసభ శ్రీనివాస్, జూలూరు దాన లక్ష్మి, రేవతి గౌడ్, డాక్టర్ లింగం గౌడ్, అచ్యుత యాదవ్ పాల్గొన్నారు.



