నవతెలంగాణ – బంజారాహిల్స్
భారతీయ చేనేత కళా వైభవాన్ని చాటిచెబుతూ హైదరాబాద్‌లోని అమీర్‌పేట కమ్మ సంఘం ప్రాంగణంలో ”స్పెషల్ హ్యాండ్లూమ్ ఎక్స్పో”ను ఏర్పాటు చేశారు. గురువారం దీనిని ఇక్కత్ హ్యాండ్లూమ్స్ బ్రాండ్ అంబాసిడర్, మిస్ ఆసియా ఇంటర్నేషనల్ రష్మీ ఠాకూర్ ముఖ్య అతిథిగా విచ్చేసి లాంచనంగా ప్రారంభించారు. ఫిబ్రవరి 4వరకు సాగనున్న ఈ ఎక్స్‌పోలో దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారులు తమ అద్భుతమైన సృజనాత్మకత ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా రష్మీ ఠాకూర్ మాట్లాడుతూ.. సంప్రదాయ కళలను, హస్తకళలను పండుగలా జరుపుకోవడం వల్ల చేనేత వర్గాలకు గొప్ప మద్దతు లభిస్తుందని తెలిపారు.
ఒకే వేదికపై ఇన్ని రాష్ట్రాల వస్త్ర శ్రేణులను చూడటం సందర్శకులకు ఒక గొప్ప అనుభూతిని ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. ఇక్కడ తెలంగాణ పోచంపల్లి ఇక్కత్ చీరలు, ఆంధ్రప్రదేశ్ కలంకారి. కాటన్ బుట్టా చీరలు, ఉత్తరప్రదేశ్ బనారసీ చీరలు, గుజరాత్ పటోలా చీరలు, మధ్యప్రదేశ్: చందేరి వస్త్రాలు, మహారాష్ట్ర పైతాని చీరలను ప్రదర్శన, అమ్మకానికి ఉంచారు. చేనేత కార్మికులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రజలందరూ ఈ ఎక్స్పోను సందర్శించి వారికి అండగా నిలవాలని టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ ప్రాంతీయ అధిపతి డాక్టర్ ఎస్. అరుణ్ కుమార్ కోరారు.
అమీర్‌పేటలో స్పెషల్ హాండ్లూమ్ ఎక్స్పో ప్రారంభం
- Advertisement -
- Advertisement -



