Friday, January 23, 2026
E-PAPER
Homeఆదిలాబాద్బాసరలో తెల్లవారుజామున కలెక్టర్ పర్యవేక్షణ..

బాసరలో తెల్లవారుజామున కలెక్టర్ పర్యవేక్షణ..

- Advertisement -

– వసంతపంచమి ఏర్పాట్లపై భక్తులను అడిగి తెలుసుకున్న కలెక్టర్
నవతెలంగాణ-ముధోల్ : దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన చదువుల తల్లి శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి జన్మదినం అయిన వసంతపంచమి సందర్భంగా భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బాసరలో మకాంవేసి పరిశీలిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున వసంతపంచమి వేడుకలు ప్రారంభం కావడంతో కలెక్టర్ అమ్మవారిని దర్శించుకున్న  అనంతరం, ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. క్యూలైన్లు ఉన్న భక్తుల వద్దకు వెళ్లి ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. భక్తులకు అందుతున్న సేవలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు చిన్న పిల్లలకు పాలు తాగునీరు అందే విధంగా తీసుకుంటున్న చర్యల గురించి భక్తుల నుండి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లు పరిశీలించారు.

గతంలో వసంత పంచమి సందర్భంగా భక్తులకు అసౌకర్యాలు కలిగిన విషయం ఈసారి ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సమీక్ష సమావేశంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఆలయ అధికారులు  భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సమీక్ష సమావేశంలో ఆదేశించారు. దీంతో ఆలయ ఈవో అంజనిదేవి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కలెక్టర్ మరోసారి భక్తులకు ఇబ్బందులు రావద్దన్న ఉద్దేశంతో దగ్గరుండి భక్తులకు అందుతున్న సేవలను స్వయంగా పరిశీలిస్తున్నారు. కలెక్టర్ బాసరలో ఉండి ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. కలెక్టర్ బాసరలో ఉండటంతో ఆలయ అధికారులు కూడా ఏలాంటి లోటు పాట్లు లేకుండాఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -