- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గణతంత్ర దినోత్సవానికి ముందు, నోయిడాలోని శివనాడర్ స్కూల్‌తో సహా అహ్మదాబాద్‌లోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. అహ్మదాబాద్‌లో బాంబు స్క్వాడ్‌తో పాఠశాలల్లో తనిఖీలు జరిగాయి. నోయిడా స్కూల్‌లో విద్యార్థులను బయటకు పంపించి, బాంబ్, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహించారు. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని, మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
- Advertisement -



