Friday, January 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్ చొరవతో కాలనీవాసులకు తీరిన నీటి కష్టాలు

సర్పంచ్ చొరవతో కాలనీవాసులకు తీరిన నీటి కష్టాలు

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ
మండల పరిధిలోని జలాల్ పూర్  ఇందిరమ్మ కాలనీలో తాగునీటి ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఇందిరమ్మ కాలనీలో తాగునీటి కోసం తాము ఇబ్బందులు పడుతున్నామని బోరు వేసి కష్టాలు తీర్చాలని ఇటీవల స్థానిక ఎన్నికల్లో కాలనీవాసులు అభ్యర్థులను కోరారు. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన గుండేటి మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం కాలనీలో నూతనంగా బోర్ వేయించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు మూగబోజన్న, కుంట శేఖర్ రాటం సాగర్ ,నాగేష్, గుండు రాజేందర్ సుద్దపల్లి గంగు ,ప్యాట్ల గంగుబాయి ,ఉల్లంగ లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి దేవేందర్ , కారోబార్ వేణుగోపాల్ , ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -