Friday, January 23, 2026
E-PAPER
Homeజిల్లాలుక్రీడలతో మానసిక ఉత్సాహం: కేంద్ర మంత్రి, గవర్నర్

క్రీడలతో మానసిక ఉత్సాహం: కేంద్ర మంత్రి, గవర్నర్

- Advertisement -

నవతెలంగాణ – బంజారాహిల్స్
హైదరాబాద్ – సికింద్రాబాద్ పరిధిలో యువతలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికితేసేందుకు ఎల్‌.బీ స్టేడియంలో జరిగిన ‘ప్రధానమంత్రి సంసద్ ఖేల్ 2025-26’క్రీడా సంబరాల ప్రారంభోత్సకార్యక్రమానికి గౌరవ కేంద్ర బొగ్గు,గనుల శాఖ మంత్రివర్యులు జి.కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో క్రీడాభివృద్ధికి, క్రీడాకారులకు ప్రధాని నరేంద్ర మోడీ ఏరకంగా సహాయ సహకారాలు అందిస్తున్నారో వివరించారు. ప్రపంచంలో భారతదేశాన్ని క్రీడల హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో.. క్షేత్రస్థాయిలో క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి, యువతను అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేయడానికి దేశంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏటా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

15 రోజుల పాటు హైదరాబాద్- సికింద్రాబాద్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఈ మెగా క్రీడోత్సవాల్లో పాల్గొనేందుకు దాదాపు 30 వేలకు పైగా క్రీడాకారులు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, ఖో-ఖో వంటి క్రీడా విభాగాల్లో ఈ పోటీలు జరుగనుండగా..ఈసారి క్రీడల్లో జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల కోసం ఇంటర్- కాలేజ్ పోటీలతో పాటు మహిళలు, దివ్యాంగులు, మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక పోటీలను నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ, గౌరవ అతిథులుగా బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎన్. రామ్‌చందర్‌ రావు, పద్మా అవార్డు గ్రహితలు పుల్లెల గోపిచంద్, సైనా నెహ్వాల్, క్రికెటర్లు ఎం.ఎస్. డయానా డేవిడ్, ఎం.ఎస్. ధృతి కేసరి హజరై వారి స్ఫూర్తిదాయక ప్రసంగాలతో యువ క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపారు. 

ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహాయ సహకారాలు అందించిన ప్రతిఒక్కరికీ గౌరవ కేంద్రమంత్రి వర్యులు జి.కిషన్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

మరింత సమాచారం కొరకు https://x.com/kishanreddybjp/status/2014321735441801457?s=20.., https://x.com/kishanreddybjp/status/2014265597585183221?s=20…సందర్శించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -