Friday, January 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నవోదయలో క్విజ్ పోటీలు

నవోదయలో క్విజ్ పోటీలు

- Advertisement -

నవతెలంగాణ-నిజాంసాగర్ 
మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్ష పే చర్చ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం క్విజ్ పోటీలను నిర్వహించడం జరిగిందని విద్యాలయ ప్రిన్సిపాల్ రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇ క్విజ్ పోటీలలో మొత్తం 8 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఆసక్తిగా పాల్గొనడం జరిగిందని ఆయన అన్నారు.

అందులో భాగంగా జవహర్ నవోదయ నిజాంసాగర్, జవహర్ నవోదయ కరీంనగర్, ఏకలవ్య గాంధారి, జిల్లా పరిషత్ హై స్కూల్ నిజాంసాగర్ అచ్చంపేట్, కేజీబీవీ నిజాంసాగర్ ఎల్లారెడ్డి, ఆదర్శ పాఠశాల నిజాంసాగర్ కు చెందిన విద్యార్థులు విద్యాలయంలో జరుగుతున్న క్విజ్ పోటీలలో పాల్గొనడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ పోటీలలో జవహర్ నవోదయ నిజాంసాగర్ విద్యార్థులు మొదటి స్థానం సాధించగా.. ఆదర్శ పాఠశాల నిజాంసాగర్ విద్యార్థులు రెండవ స్థానం సాధించారు. కేజీబీవీ నిజాంసాగర్ విద్యార్థులు మూడో స్థానంలో నిలిచినట్టు ప్రిన్సిపాల్ తెలిపారు.కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన ఎస్కర్ట్ టీచర్స్, విద్యాలయ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -