Friday, January 23, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలి

ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలి

- Advertisement -

కళాశాల ప్రిన్సిపాల్ పి. సునీల్ కుమార్..
నవతెలంగాణ – కుభీర్
ప్రభుత్వ కళాశాలలో చదువుకునే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రతి ఒక్క విద్యార్థి కృషి చేయాలని కళాశాల ప్రిన్సిపాల్ పి సునీల్ కుమార్ విద్యార్థులకు సూచించారు. ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్  కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు శుక్రవారం మండల కేంద్రమైన కుబీర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో మెరుగైన విద్యాభ్యాసం చేపట్టడం జరుగుతుందని ఆయన సూచించారు. అదేవిధంగా కళాశాల ఏర్పాటు అయిన నుంచి ఇప్పటివరకు దాదాపుగా వంద మంది విద్యార్థులు ప్రభుత్వ కొలువులు సాధించిన ఘనత కుభీర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు దక్కుతుందని అన్నారు. దీంతో కొలువులు సాధించిన విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని మరిన్ని మంచి ఫలితాలు సాధించేలా ప్రతి ఒక్క విద్యార్థి కృషి చేయాలని అన్నారు. దీంతోపాటు విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరై హాజరు శాతం పెంచేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకుల బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -