Friday, January 23, 2026
E-PAPER
Homeక్రైమ్Phone tapping: ముగిసిన కేటీఆర్‌ విచారణ…7గంటల పాటు ప్రశ్నించిన సిట్‌

Phone tapping: ముగిసిన కేటీఆర్‌ విచారణ…7గంటల పాటు ప్రశ్నించిన సిట్‌

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విచారణ ముగిసింది. దాదాపు 7గంటల పాటు ప్రశ్నించిన సిట్‌ అధికారులు.. వాంగ్మూలం రికార్డు చేశారు. కేటీఆర్‌, రాధాకిషన్‌రావు.. ఇద్దరినీ కలిపి సిట్‌ అధికారులు విచారించినట్టు తెలుస్తోంది. విచారణ ముగిసిన తర్వాత జూబ్లీహిల్స్‌ పీఎస్‌ నుంచి కేటీఆర్‌ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఎస్‌ఐబీ కేంద్రంగా ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ జరిగిందంటూ 2024 మార్చిలో పంజాగుట్ట పోలీస్ స్టేసన్ లో నమోదైన కేసును ప్రస్తుతం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ నేతృత్వంలోని సిట్‌ దర్యాప్తు చేస్తోంది. ఈకేసు దర్యాప్తులో భాగంగానే తాజాగా కేటీఆర్‌ను సిట్‌ విచారించింది. ఈ కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిపి కేటీఆర్‌ను సిట్‌ విచారించింది. కేసు నమోదై దాదాపు రెండేండ్లు కావస్తున్నా దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -