నవతెలంగాణ-జుక్కల్: మండల పరిధిలోని మహమ్మదాబాద్ తండా వాసులు శుక్రవారం రహదారిపై బైఠాయించారు. నిత్యం ఈ రోడ్డుపై దుమ్మూ ధూళితో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత 9 నెలలుగా ఆర్ అండ్ బి రోడ్డు జుక్కల్ ఎక్స్ రోడ్డు నుండి బాలాజీ నగర్ వరకు రోడ్డుని తొవ్వేసి వదిలేశారని, పలుచోట్ల రోడ్డుపై గుంతలు పడ్డాయని, వాటిని పూడ్చకుండా అధికారులు నిర్లక్ష్యంగా వదిలేశారని ఆరోపించారు. అంతేగాక రహదారి నిర్మాణానికై సిమెంట్ కంకరను సరైన రీతిలో వినియోగించలేదని, దీంతో వాహనాల రాకపోకలతో దుమ్మూ ధూళి రావడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో అనారోగ్యాలకు గురువుతున్నామని, వెంటనే స్థానిక ఎమ్మెల్యే, అధికారులు స్పందించి రోడ్డుమార్గాన్ని పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.
రోడ్డుపై బైఠాయించిన మహమ్మదాబాద్ తాండవాసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



