Friday, January 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వినాయక నగర్ కాలనీలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఏఎస్పీ

వినాయక నగర్ కాలనీలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఏఎస్పీ

- Advertisement -

– కాలనీవాసులను అభినందించిన ఏఎస్పీ చైతన్య రెడ్డి
నవతెలంగాణ –  కామారెడ్డి

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వినాయక నగర్ కాలనీలో కాలనీవాసులు  ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను ఏఎస్పీ చైతన్య రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాలనీవాసులంతా స్వచ్ఛందంగా ఇంటికి రూ.1500 చొప్పున విరాళం సేకరించి సొంతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ప్రతి కాలనీ తమ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని పోలీసులకు సహకరించాలని కోరారు. సీఐ నరహరి సహకారంతో ఈ సీసీ కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సీఐ నరహరి మాట్లాడుతూ.. పోలీసులు సూచించిన వెంటనే స్పందించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న వినాయక నగర్ కాలనీవాసులు అందరికీ అభినందనలు తెలిపారు. కాలనీ అధ్యక్షులు చింతల లింగం మాట్లాడుతూ..  ప్రస్తుతం కాలనీలో 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండో విడతలో మరో 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కాలనీవాసులందరి సహకారంతోనే ఈ కార్యక్రమం విజయవంతమైందని, వినాయక నగర్ కాలనీలో ఏ కార్యక్రమమైనా అందరూ కలిసి నిర్వహించడం వల్ల ఇతర కాలనీలకు ఆదర్శంగా నిలుస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాలనీ కోశాధికారి డాక్టర్ ఏ. సునీల్ కుమార్, ప్రధాన కార్యదర్శి షాదుల్లా, అడ్వకేట్ తిరుపతి, రామకృష్ణ రాజు, రంజిత్, కే. శ్రీనివాస్, నరేష్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కమలాకర్ రెడ్డి, రిపోర్టర్ సంజీవ్, నరసయ్య, దత్తు, ప్రవీణ్, రమేష్, శ్రీనివాస్ పొన్నాల, కిషన్, స్వామి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు కూడా హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -