చిల్వేర్ సర్పంచ్ నాగరాజు
నవతెలంగాణ – మిడ్జిల్
గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాగా ఎదగాలని సర్పంచి నాగరాజు గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని చిల్వేర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య సమరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ త్యాగాలు, దేశభక్తి, ధైర్యసాహసాలు ప్రతి భారతీయునికి ఆదర్శమని పేర్కొన్నారు. యువత నేతాజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎండీ ఖాళీలోదిన్,ఉప సర్పంచ్ జి. మోహన్, డైరెక్టర్ సత్యం గౌడ్, మాజీ ఎంపీటీసీ రాజారెడ్డి, వార్డ్ సభ్యులు హుస్సేన్, నాగార్జున, మహానంది, విజయ, జంగమ్మ, యువకులు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



