నవతెలంగాణ – ఆలేరు
చేనేత కార్మికులు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది అని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు .ఆలేరులో మార్కండేయ గుడి వద్ద జరిగిన చేనేత కార్మికుల రుణమాఫీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చేనేత వృత్తిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందన్నారు. రుణభారం నుండి విముక్తి కల్పించడంతో ఆత్మవిశ్వాసంతో చేనేత కార్మికులు ముందుకు సాగాలన్నారు. ఆలేరు నియోజకవర్గం లో 362 మంది చేనేత కార్మికులకు రెండు కోట్ల 69 లక్షల రుణమాఫీ కొరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపక ఆలేరు మరియు యాదగిరిగుట్ట పట్టణాల పరిధిలో 164 మంది చేనేత కార్మికులకు ఒక కోటి 18 లక్షలు నిధులు మంజూరు అయ్యాయి అన్నారు.
నియోజవర్గంలో నూతన పొదుపు పథకం కింద 1 607 చేనేత కార్మికులు నమోదు అయ్యారని చెప్పారు. వీరికి ప్రతినెల 32 లక్షల చొప్పున ఇప్పటివరకు 64 లక్షల నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు. అలాగే ఈ పథకంలో భాగంగా 2021/ 24 సంవత్సరాలకు 1862 మంది చేనేత కార్మికులకు 18.60 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ఆలేరు పట్టణంలో చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, కాంగ్రెస్ నాయకులు కండెం సంజీవరెడ్డి, జనగాం ఉపేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వెంకట్ రాజు, నీలం పద్మా వెంకటస్వామి, చింతకింది మురళి, ఎండి సలీం, చిక్క శ్రావణ్, సాగర్ రెడ్డి, ఎగ్గిడి శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.



