- Advertisement -
నవతెలంగాణ – రాయికల్
రాయికల్ అటవీ రేంజ్ పరిధిలోని కట్కాపూర్,భూపతిపూర్ తదితర అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల గణన కొనసాగుతోంది.వన్యప్రాణుల సంఖ్యను నమోదు చేయడానికి ప్రత్యేక బృందాలు ఉదయం, సాయంత్రం వేళల్లో గణన చేపడుతున్నాయి. అటవీశాఖ అధికారి టి.భూమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. శాఖాహార, మాంసాహార వన్యప్రాణుల కాళ్ల అడుగుల గుర్తులు, మలం, చెట్లపై గీతల ఆధారంగా జంతువులను గుర్తించి ప్రత్యేక యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్ పద్మ, సెక్షన్ ఆఫీసర్ విజయకుమార్, బీట్ ఆఫీసర్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ గణన వన్యప్రాణుల సంరక్షణకు ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.
- Advertisement -



