Friday, January 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ ను బలోపేతం చేయాలి 

బీఆర్ఎస్ ను బలోపేతం చేయాలి 

- Advertisement -

క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ 
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమంను నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నసురుల్లాబాద్ బస్టాండ్ ఎదుట మండల సీనియర్ నాయకులు నర్సింలు గౌడ్, ఆధ్వర్యంలో క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  బీఆర్ఎస్ నేత నర్సింలు మాట్లాడుతూ.. బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా కౌన్సిలర్లను గెలుచుకొని చైర్మన్ పీఠాన్ని కైవాసం చేసుకుంటామన్నారు. బాన్స్వాడ నియోజకవర్గం ఇంచార్జ్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో మరోసారి టిఆర్ఎస్ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్  అవుతారని ఆయన సూచించారు.

రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడే విధంగా షేక్ జుబేర్ అన్న నాయకత్వంలో పార్టీ కార్యకర్తలంతా ఐక్యంగా, పార్టీ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లి, బీఆర్‌ఎస్ బలోపేతానికి ప్రతి కార్యకర్త తన వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టేకుర్ల సాయిలు, మైలారం మాజీ సర్పంచ్ మహేందర్ వెంకట్ సార్, లక్ష్మణ్, రమేష్,  శ్రీను, కుమార్,  భూమయ్య, సాయిలు, శేఖర్గం, గాధర్ కృష్ణ, గంగారం, సాయిలు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -