Thursday, May 14, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంక్రూయిజ్ నౌకలో నోరోవైరస్ కలకలం..1700 మందికి క్వారంటైన్

క్రూయిజ్ నౌకలో నోరోవైరస్ కలకలం..1700 మందికి క్వారంటైన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : విహార నౌకల్లో వరుసగా వైరస్‌లు వ్యాపిస్తున్న ఘటనలు పర్యాటకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ‘యాంబిషన్’ అనే క్రూయిజ్ నౌకలో నోరోవైరస్ వ్యాప్తి చెందడంతో ఫ్రాన్స్‌‌లో కలకలం రేగింది. సుమారు 1700 మంది ప్రయాణికులు, సిబ్బందితో బెల్‌ఫాస్ట్ నుంచి స్పెయిన్‌కు వెళ్తున్న ఈ నౌకను ఫ్రాన్స్‌‌లోని బోర్డెక్స్ పోర్టులో అధికారులు నిలిపివేశారు.

నౌకలోని సుమారు 50 మంది ప్రయాణికులు వాంతులు, విరేచనాల వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన ఫ్రెంచ్ ఆరోగ్య అధికారులు నౌకను తాత్కాలికంగా క్వారంటైన్ చేశారు. మే 10న నౌకలో 92 ఏళ్ల వృద్ధుడు మరణించినట్లు నౌక యాజమాన్య సంస్థ ‘అంబాసిడర్ క్రూయిజ్ లైన్’ ధృవీకరించింది. అయితే, అతడి మరణానికి, ఈ వైరస్ వ్యాప్తికి ఎలాంటి సంబంధం లేదని, మృతుడికి వైరస్ లక్షణాలు లేవని స్పష్టం చేసింది.

వైద్య బృందాలు నౌకలోని వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా, ఇది నోరోవైరస్ వ్యాప్తిగా నిర్ధారించారు. అనంతరం, ఎలాంటి లక్షణాలు లేని ప్రయాణికులు నౌక నుంచి దిగేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. వైరస్ సోకిన వారికి నౌకలోనే ఐసొలేషన్‌లో చికిత్స అందిస్తున్నారు. ఇటీవల మరో నౌకలో వ్యాపించిన హంటా వైరస్‌కు, ప్రస్తుత నోరోవైరస్ ఘటనకు ఎటువంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. నౌకలో మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టినట్లు, ప్రయాణికులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు క్రూయిజ్ సంస్థ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -