నవతెలంగాణ – ఆలేరు
సింగరేణి కాలరీస్ లిమిటెడ్ సంస్థలో 2014 నుండి ఇప్పటివరకు జరిగిన అన్ని టెండర్లపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. నవతెలంగాణతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కోల్ బ్లాక్ విషయంలో తలెత్తిన వివాదంపై కేంద్ర మంత్రిగా వెంటనే స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇద్దరు సభ్యులతో కూడిన విచారణ కమిటీ డిప్యూటీ డైరెక్టర్ చేతన శుక్ల, టెక్నికల్ డైరెక్టర్ మారపెల్లి వెంకటేశ్వర్లను నియమించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. కేవలం నైని కోల్డ్ బ్లాక్ టెండర్ రద్దు అంశానికి విచారణ పరిమితం చేయకుండా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గత బి ఆర్ ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అన్ని టెండర్లు, అధికార ప్రక్రియలపై సమగ్ర లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని నేను బలంగా భావిస్తున్నాను అని అన్నారు.
అంశాల వారిగా వినమ్రంగ వేడుకుంటున్న ముఖ్యమైన నా డిమాండ్లు
1) 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని టెండర్లు మా పాలనతో సహా పూర్తిస్థాయి విచారణ చేపట్టి బహిర్గతం చేయాలి
2) టెండర్ల ప్రక్రియను గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు విచారణ పరిధిలోకి తీసుకురావాలి
3) ప్రజలకు వాస్తవాలు తెలియజేయండి రాజకీయాలు పక్కకు పెట్టండి



