Friday, January 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలేరులో ఫర్టిలైజర్ సెల్ పాయింట్ ప్రారంభం 

ఆలేరులో ఫర్టిలైజర్ సెల్ పాయింట్ ప్రారంభం 

- Advertisement -

ఆలేరు గ్రామ సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి 
శ్రీరామగిరి పీఏసీఎస్ పర్సన్ ఇంచార్జి కే రమేష్ 
నవతెలంగాణ – నెల్లికుదురు

మండలంలోని ఆలేరు గ్రామంలో శ్రీరామగిరి పిఎసిఎస్ ఆధ్వర్యంలో సేల్ పాయింట్ ను ప్రారంభించినట్లు ఆ గ్రామ సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం శ్రీరామగిరి పిఎసిఎస్ పర్సన్ ఇంచార్జి కే రమేష్ తో కలిసి సమావేశం ఏర్పాటు చేసి ఫర్టిలైజర్ సేవలను సద్వినియోగం చేసుకునే దానిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రాంత రైతులు ఎక్కడికో దూర ప్రాంతాలకు పోయి మందు బస్తాల కోసం ఇబ్బంది పడుతున్నారని అలా పడకూడదనే ఉద్దేశంతో ఈ ఆలేరు గ్రామ పరిధిలో ఒక షాపును ఏర్పాటు చేయాలని ఈ సెంటర్ ను ప్రారంభించామని అన్నారు.

రైతులు దీనిని సద్వినియోగం చేసుకొని రైతంగం పంట లకు సరిపోను మందు బస్తాలు తీసుకొని అధిక దిగుబడి వచ్చే విధంగా రైతాంగం కృషిచేసి ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పాయింట్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో, ఏఈఓ మణికంఠ  తొర్రూర్ ఎఎంసి మార్కెట్ డైరెక్టర్ కాలేరు మల్లేశం  శ్రీరామగిరి సొసైటీ సీఈఓ కత్తుల వెంకన్న  సిబ్బంది గండి వెంకన్న  శ్రీరాo రంజిత్  మాల్సూర్ అలీ వివిధ గ్రామాల సర్పంచ్ ఉప సర్పంచ్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -