చైతన్య యూత్ అధ్యక్షుడు ప్రతాప్
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని ఎర్రబెల్లి గూడెం గ్రామంలో బొమ్మ గాని లచ్చమ్మ మృతిచెందగా ఆ కుటుంబాన్ని సందర్శించి చైతన్ యూత్ ఆధ్వర్యంలో ఒక కింట బియ్యాన్ని కుటుంబ సభ్యులకు అందజేసినట్లు చైతన్య యూత్ అధ్యక్షులు ప్రతాప్ తెలిపారు. శుక్రవారం యూత్ సభ్యులతో కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యం నింపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రామానికి చెందిన బొమ్మగాని అంజయ్య తల్లి అయిన బొమ్మగాని లచ్చమ్మ ఆమె మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు. మృతి చెందిన కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. మృతి చెందిన కుటుంబానికి ప్రత్యేక అండగా నిలవాలని కోరినట్లు తెలిపారూ. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొమ్మెర అశోక్, కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు పల్లె యాకయ్య, రాజశేఖర్, సోమయ్య, పల్లె కిరణ్, క్రాంతి, శ్రీ పాల్, గణేష్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి బియ్యం అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



