Friday, January 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మానాల మోహన్ రెడ్డి

ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మానాల మోహన్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని కోన సమూందర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ పెద్దమ్మ తల్లి దశమ వార్షికోత్సవ వేడుకల్లో శుక్రవారం రాష్ట్ర కోఆపరేటివ్ సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోహన్ రెడ్డికి ఆలయ పూజారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలతో పాటు అమ్మవారి ఆశీర్వచనాలను అందించారు. అనంతరం ఆయనను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైడి మధులత శ్రీనివాస్ రెడ్డి, హనుమాన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -