Friday, January 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వంజరి సంఘం క్యాలెండర్లు, కరపత్రాల ఆవిష్కరణ

వంజరి సంఘం క్యాలెండర్లు, కరపత్రాల ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలో శుక్రవారం జిల్లా వంజరి సంఘం క్యాలెండర్లను, జిల్లా వంజరి మహా సర్వసభ్య సమావేశం కరపత్రాలను నిజామాబాద్ వంజరి సంఘం అధ్యక్షులు భువనేకర్ భూమయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 25న మామిడిపల్లిలోని జిల్లా వంజరి కళ్యాణ మండపంలో జిల్లా వంజరి మహా సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి వంజరి కులస్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.

జిల్లాలో 18 సంవత్సరాలు ప్రతి వంజరి  కులస్తులు జిల్లా వంజరి సంఘంలో సభ్యత్వం పొందాలన్నారు. ఇందుకు గాను రూ.500 సభ్యత్వ రుసుము చెల్లించి శాశ్వత సభ్యులుగా చేరాలని కోరారు. శాశ్వత సభ్యత్వం పొందిన సభ్యునికి సంఘం నుండి గుర్తింపు కార్డు జారీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్డుతో ఎన్నికల్లో పోటీ చేయడానికి ఓటు వేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కాలేవర్ గంగాధర్, సుభాష్, దాత్రిక రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -