Friday, January 23, 2026
E-PAPER
Homeఆదిలాబాద్బాసర ఆలయంలో అలరించిన సంగీత కచేరి

బాసర ఆలయంలో అలరించిన సంగీత కచేరి

- Advertisement -

108 కళాకారులతో సామూహిక వీణ వాయిద్యం
శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి కళార్చన
నవతెలంగాణ – ముధోల్ 

భారతదేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రం చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయక్షేత్రంలో శుక్రవారం అమ్మవారి పుట్టినరోజు శుభ సందర్భంగా వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని పోతరాజు జయలక్ష్మి, ఆధ్వర్యంలో సామూహిక వీణా కార్యక్రమం నిర్వహించారు. త్యాగరాజ మ్యూజిక్ కళాశాల శ్రీ భక్తరామదాస్ మ్యూజిక్ కళాశాలలో ప్రముఖ వీణా అధ్యాపకురాలిగా  జయలక్ష్మి సేవలందిస్తూ తమ సంగీత సాధనతో అనేక మంది ప్రతిభావంతమైన శిష్యులను  తీర్చిదిద్దారు.

వీణా విద్యలో వారికి ఉన్న అపారమైన అనుభవం, నిబద్ధత, అంకితభావం వల్ల ఎంతో మంది శిష్యులు నేడు వీణా విద్వాంసులుగా ఎదిగి సంగీత లోకంలో తమ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. అటువంటి విశిష్ట కళాకారిణి అయిన జయలక్ష్మి ఎన్నో ప్రతిష్టాత్మక వీణా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి అనేక పురస్కారాలు ప్రముఖుల మన్ననలు ప్రశంసలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో  వసంత పంచమి సందర్భముగా బాసర క్షేత్రంలో వారి శిష్యబృందం చేత అమ్మవారికి అంకితంగా కచ్చపి అష్టోత్ర వీణా స్వరార్చనను భక్తి సంగీతం, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా నిలిచే దివ్యమైన కార్యక్రమంగా ఒకేసారి సామూహికంగా 108 మంది కళాకారులు తమ వీణ వైద్యంతో కలమ్మ తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి కి కళాశాల రూపంలో సమర్పించారు.

సామూహిక వీణా వాయిద్యం కార్యక్రమాన్ని అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా చూసి భక్తులు మంత్రముగ్ధులయ్యారు. ఇటువంటి అపూర్వమైన వీణానాదాన్ని ఆస్వాదించి భక్తులు చూస్తూ సాక్షాత్తు శ్రీసరస్వతి దేవి వీణ వాయిస్తున్నట్టుగా అమ్మవారి రూపంలో కళాకారులు కనబడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారిని అంజనాదేవి, ఏఈఓ సుదర్శన్ గౌడ్, ఆలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -