Thursday, May 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముదకపల్లిలో బడిబాట కార్యక్రమం

ముదకపల్లిలో బడిబాట కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – మోపాల్ : బడిపాట కార్యక్రమంలో భాగంగా జెడ్పీహెచ్‌ఎస్ ముదకపల్లి పాఠశాలలో గురువారం రోజున విద్యాశాఖ ఆదేశాల మేరకు బడిపాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, వెంకటలక్ష్మి ఉపాధ్యాయులు, ముదకపల్లి సర్పంచ్ నరేష్ మరియు వార్డు సభ్యులు కలిసి పాఠశాల నుండి బడిపాట ర్యాలీ నిర్వహించి, అనంతరం డోర్ టు డోర్ సర్వే చేయడం జరిగింది. అనంతరం  సర్పంచ్ తో కలిసి గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి అక్కడి తల్లిదండ్రులతో ప్రభుత్వ పథకాలు, చదువు ప్రాముఖ్యత గురించి సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరిగింది.

ఈ సందర్భంగా సర్పంచ్ నరేష్ మాట్లాడుతూ కచ్చితంగా మన గ్రామంలోని ప్రజలందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోని చదివించాలని ప్రైవేట్ పాఠశాలల్లో చదివించి అప్పుల పాలు కావద్దని ప్రభుత్వం పాఠశాలలో కూడా చాలా ఉత్తమ ఉపాధ్యాయులు ఉంటారని ఆయన తెలియజేశారు. పాఠశాలలో విద్యాశాఖ ఆదేశాల మేరకు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి, పదో తరగతి టాపర్స్‌కు మరియు పాఠశాలలో 100 శాతం హాజరు సాధించిన విద్యార్థులకు చిన్న సత్కారం చేసి సర్టిఫికెట్లు బహూకరించడం జరిగింది. ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించగా, అందులో భాగంగా పేరెంట్స్ మరియు చిన్నారులకు వివిధ ఆహార పదార్థాలను రుచి చూపించడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -