Saturday, January 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆ ఘటన వల్ల ఏం జరిగింది?

ఆ ఘటన వల్ల ఏం జరిగింది?

- Advertisement -

ఒక రోజు జరిగిన అనుకోని ఓ ఘటనతో 6 వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న న్యూ ఏజ్‌ క్రైమ్‌ కామెడీ ‘బా బా బ్లాక్‌ షీప్‌’.
దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. టిను ఆనంద్‌, ఉపేంద్ర, జార్జ్‌ మరియన్‌, అక్షయ్‌, విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి, కశ్యప్‌, రాజా రవీంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను హీరో శర్వానంద్‌ విడుదల చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు. టీజర్‌ చూస్తుంటే…డిఫరెంట్‌ కామెడీ, బ్యూటీఫుల్‌ లోకేషన్స్‌లో ‘బా బా బ్లాక్‌ షీప్‌?’ చిత్రాన్ని రూపొందించారని టీజర్‌ను చూస్తుంటే అర్థమవుతుంది. మూవీ ఓ బాక్స్‌?, గన్‌ చుట్టూ తిరిగుతుందని అర్థమవుతుంది.

ఇంతకీ ఆ గన్‌ కోసం మాఫియా డాన్‌ ఎందుకు వెతుకుతుంటాడు. చివరకు ఆ బాక్స్‌ ఎవరి దగ్గర ఉంటుంది.. ఆ బాక్స్‌లో ఏముంటుందనే విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటున్నారు నిర్మాత వేణు దోనేపూడి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘సినిమా మొత్తాన్ని మేఘాలయా రాష్ట్రం లోనే పూర్తి చేశాం. చిరపుంజి వంటి అద్భుతమైన లొకేషన్స్‌ లోనూ చిత్రీకరించాం. మేఘాలయాలో మొత్తం సినిమా షూటింగ్‌ జరుపుకున్న తొలి సినిమా ‘బా బా బ్లాక్‌ షీప్‌?’. అతి తక్కువ రోజుల్లోనే పక్కా ప్లానింగ్‌తో సినిమాను కంప్లీట్‌ చేశాం. మా డైరెక్టర్‌ గుణి, నటీనటులు, సాంకేతిక నిపుణులు సహా ఎంటైర్‌ టీమ్‌ సహకారంతో ఇది సాధ్యమైంది. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేస్తాం. మా సినిమా తప్పకుండా అందర్నీ అలరిస్తుంది’ అని అన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -