నవతెలంగాణ – మల్హర్ రావు:-
తన పొలం చుట్టూ బైండింగ్ వైర్ తో అక్రమ విధ్యుత్ కలెక్షన్ ఇవ్వడం వలన ఒక వ్యక్తి మృతికి కారకుడైన వ్యక్తికి మూడు సంవత్సరాల ఆరు నెలలు కారాగార శిక్ష లేదా, రూ.1లక్ష, పదివేల రూపాయలు జరిమానా విదిస్తూ భూపాలపల్లి కోర్టు జిల్లా ప్రదాన న్యాయమూర్తి సిహెచ్. రమేష్ బాబు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చినట్లుగా తెలిసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లా మల్వర్ రావు మండలంలోని తాడిచెర్ల గ్రామానికి చెందిన అంగజాల దేవయ్య అనే వ్యక్తి తన పొలం చుట్టూ బైండింగ్ వైర్ తో పొలం రక్షణ కొరకు అక్రమంగా విధ్యుత్ కనెక్షన్ ఇవ్వగా తేదీ 29.10.2017 రోజున అదే గ్రామస్తుడైన బుర్ల సదయ్య అను వ్యక్తి అట్టి విధ్యుత్ వైర్ కాలికి తగిలి విధ్యుత్ షాక్ వలన అక్కడిక్కడే మృతి చెందాడు.ఇట్టి సంఘటనపై మృతుడు సదయ్య బార్య బుర్ల పద్మ ఇచ్చిన పిర్యాదు మేరకు అప్పటి కొయ్యూరు ఎస్ఐ బెల్లం స్వామి కేసు నమోదు చేయగా,అప్పటి కాటారం సిఐ శంకర్ రెడ్డి నిందితున్ని అరెస్ట్ చేసి సరిమైన సాక్షాదారాలలో కోర్టులో బార్జ్‌షీట్ దాఖలా చేసినారు.ఇట్టి కేసులో విచారణ సమయములో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎదులాపురం శ్రీనివాస్ వాదనలు వినిపించగా ప్రస్తుత కాటారం సిఐ నాగార్జునరావు, ప్రస్తుత కాటారం ఎస్ఐ నరేష్ పర్యవేక్షణలో కోర్టు లైజన్ ఆఫీసర్ జి.వెంకన్న ఏఎస్ఐ, సిడిఓ రమేష్ లు సాక్షులను కోర్టులో ప్రవేశ పెట్టారు.ఇట్టికేసులో సమర్దవంతంగా పనిచేసిన అధికారులను భూపాలపల్లి జిల్లా పోలీసు అధికారి సిరిసెట్టి సంకీర్త్ అభినందించినారు.
అక్రమ విద్యుత్ కనెక్షన్ తో వ్యక్తి మృతి కారణమైన వ్యక్తికి మూడేళ్లు జైలు శిక్ష.
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



