– ఘనంగా పవిత్ర గంధోత్సవం
నవతెలంగాణ- పాలకవీడు
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్‌పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో ప్రధానఘట్టం గంధోత్సవం శుక్రవారం ప్రశాంతం గా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని భారీ నీటిపారుదల, గృహ నిర్మాణ శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. దర్గా ముజవర్ నివాసం నుంచి ముస్లిం మతపెద్దలు, దర్గా పూజారులు, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి పవిత్ర గంధాన్ని ఎత్తుకొని సుందలెకాన వరకు తీసుకెళ్లారు. అనంతరం దర్గాలోకి చేరుకున్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు మంత్రి తెలిపారు. పవిత్ర గంధాన్ని గుర్రాలపై పెట్టి జాన్‌పహాడ్, జాన్‌పహాడ్ దర్గా పరిసర గ్రామాలలో ఊరేగింపు చేశారు.
ఈ క్రమంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మధ్య నిర్వహించారు. తిరిగి మధ్యాహ్నం దర్గాకు చేరుకున్న గంధాన్ని దర్గా ముజవరీ అలీబాబా సమాధులపైకి ఎక్కించడంతో గంధ మహోత్సవం ముగిసింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపాల్‌నాయక్, మాజీ జెడ్పీటీసీ బుజ్జి మోతిలాల్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సుబ్బారావు, నేరేడుచర్ల మార్కెట్ కమిటీ చైర్మెన్ బెల్లంకొండ విజయలక్ష్మీ నరసింహారావు, సర్పంచులు నీమా నాయక్, దాసు, నాయకులు తీగలశశిరెడ్డి, జితేందర్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్, డెక్కన్ ఫ్యాక్టరీ జిఎం నాగమల్లేశ్వరరావు, తహసీల్దార్ కమలాకర్, ఎస్.రవ్వ కోటేష్, అధికారులు పాల్గొన్నారు.
జాన్‌పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



