Saturday, January 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసమన్వయంతో మేడారం జాతర సక్సెస్‌ చేద్దాం

సమన్వయంతో మేడారం జాతర సక్సెస్‌ చేద్దాం

- Advertisement -

– సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను పోలీసు, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో సక్సెస్‌ చేద్దామని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లాలోని పోలీసు కమిషనరేట్‌లో జాతర సందర్భంగా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తే ప్రాంతాలు, కారణాలపై పోలీసు, ఆర్టీసీ అధికారు ల సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సన్‌ప్రీత్‌సింగ్‌ మాట్లాడుతూ.. మేడారానికి వెళ్లే మార్గంలో బస్సు నిలిపి టికెట్లు జారీ చేయొ ద్దని సూచించారు. గతంలో సమస్యలు సృష్టించిన డ్రైవర్లను విధుల్లోకి తీసు కోవద్దన్నారు. డ్రైవర్లకు తప్పనిసరిగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిం చాలని తెలిపారు. ఒకవేళ బస్సు బ్రేక్‌ డౌన్‌ అయితే రోడ్డుపై నిలిచిన బస్సు ను తక్షణమే మరమ్మతులకు మెకానిక్‌లు అందుబాటులో ఉండేలా క్యాంప్‌లను ఏర్పాటు చేయాలన్నారు. బస్సులను రోడ్డు కిరువైపులా ఆపొద్ద న్నారు. బస్టాండ్‌ నుంచి బయలుదేరిన బస్సులు ఎక్కడా ఆగకుండా మేడారం బస్టాండ్‌లో మాత్రమే ఆగుతుందన్నారు.

భక్తులు కాల కృత్యాలు తీర్చుకొని, తినుబండారాలు తమతో తెచ్చుకోవాలని సూచించారు. బస్టాండ్‌లో అధికా రులు విస్తృతంగా ప్రచారం చేయాలని ఆర్టీసీ అధికారులను కోరారు. నగరం లో ఏ ప్రాంతంలోనైనా ట్రాఫిక్‌ సమస్య ఎదురైతే జాతర కు వెళ్లే బస్సులను ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపించాలని పోలీసు అధికారులకు సూచించా రు. హనుమకొండ జిల్లా బాలసముద్రం నుంచి జాతరకు వెళ్లే బస్సులకు ట్రాఫిక్‌ సమస్యల్లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశం లో డీసీపీలు అంకిత్‌కుమార్‌, దార కవిత, ట్రాఫిక్‌ అడిషనల్‌ డీసీపీ ప్రభాకర్‌రావు, ఆర్టీసీ ఆర్‌ఎం డి. విజయభాను, డిప్యూటీ ఆర్‌ఎం భానుకిరణ్‌, మహేశ్‌, డిపో మేనేజర్లు రవి చందర్‌, అర్పిత, ధర్మా సింగ్‌, ఏసీపీలు సత్యనారాయణ, జానీ నర్సింహులు, ట్రాఫిక్‌ ఇన్స్‌పెక్టర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -