Saturday, January 24, 2026
E-PAPER
Homeజాతీయంఅమెజాన్‌లో 16 వేల మందిపై వేటు..!

అమెజాన్‌లో 16 వేల మందిపై వేటు..!

- Advertisement -

హెచ్‌ఆర్‌ విభాగాల్లో ఉద్యోగులపై ఉద్వాసన కత్తి

న్యూఢిల్లీ : ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌లో వేలాది ఉద్యోగులు రోడ్డున పడనున్నారని తెలుస్తోంది. వచ్చే వారం దాదాపు 16,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు రిపోర్టులు వస్తున్నాయి. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌, రిటైల్‌, ప్రైమ్‌ వీడియోతో పాటు హెచ్‌ఆర్‌ విభాగాల్లోని ఉద్యోగులపై ఉద్వాసనల కత్తి వేలాడుతోందని తెలుస్తోంది. అమెజాన్‌లో దాదాపు 3,50,000 మంది కార్పొరేట్‌ ఉద్యోగులు పనిచేస్తుండగా.. వారిలో 10 శాతానికి సమానమైన 30 వేల మందిని తప్పిస్తారంటూ గతేడాది రిపోర్టులు వచ్చాయి. ఆ తర్వాత 14వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు అమెజాన్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా జనవరి 27న అమెజాన్‌ సుమారు 16వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీనిపై ఆ కంపెనీ స్పందించాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -