Saturday, January 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఐదు గ్రామ పంచాయతీల సంగతి ఏమైంది..!

ఐదు గ్రామ పంచాయతీల సంగతి ఏమైంది..!

- Advertisement -

– కేంద్ర, ఏపీ ప్రభుత్వాలతో ముఖ్యమంత్రి చర్చించాలి
– ఆలయ అభివృద్ధి పట్ల సీఎం స్పందించటాన్ని స్వాగతిస్తున్నాం
– నిధులు కేటాయించి పనులు చేపట్టాలి
– భద్రాచలం అభివృద్ధికి కృషి చేయాలి : సీపీఐ(ఎం) జిల్లా భద్రాద్రి కొత్తగూడెం కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-భద్రాచలం

భద్రాచలం రామాలయం అభివృద్ధి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించటాన్ని స్వాగ తిస్తున్నామని, అదే సమయంలో ఐదు గ్రామ పంచాయతీల సంగతేమిటని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. సీపీఐ(ఎం) భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని పట్టణానికి ఆనుకొని ఉన్న ఐదు పంచాయతీలను తెలంగాణలో కలిపేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఏపీలోని కూటమి ప్రభుత్వంతో సీఎం చర్చించాలని అన్నారు. భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు కేటా యిస్తామని, బాసర నుంచి భద్రాచలం రామాలయం వరకు గోదావరి సర్క్యూట్‌ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన.. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా నిధులు కేటాయించి వెంటనే పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర విభజనలో భద్రాచలం తీవ్రంగా నష్టం పోయిందని, పట్టణానికి ఆనుకుని ఉన్న 5 గ్రామపంచాయతీలను తెలంగాణలో కలపడం ద్వారా పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. గోదావరి కరకట్ట ఎత్తుపెంచి ఇరువైపులా పొడిగించేందుకు నిధులు కేటాయించా లని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్‌, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, బండారు శరత్‌ బాబు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకట రామారావు, పి. సంతోష్‌ కుమార్‌, డి. సీతాలక్ష్మి, పట్టణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -