– రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి
– పోలీసుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
– ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్‌రెడ్డి
– నిజామాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ ప్రారంభోత్సవం
నవతెలంగాణ-కంఠేశ్వర్
ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించేందుకే అత్యాధునిక వసతులతో పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మించినట్టు రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్‌లో నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, రాకేష్‌రెడ్డి, ఐజీ మల్టీజోన్ వన్ చంద్రశేఖర్, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్యతో కలిసి రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. నేర రహిత సమాజం సీసీ కెమెరాల నిఘా, క్షేత్రస్థాయిలో పెట్రోలింగ్ పెంచడం ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని తెలిపారు. నూతన భవనాల్లో సిబ్బందికి మెరుగైన పని వాతావరణం లభిస్తుందని, ఇది వారి పనితీరును మెరుగుపరుస్తుందని అన్నారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ విషయంలో ప్రజలను ముఖ్యంగా యువతను చైతన్యపరచాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు పోషిస్తున్న పాత్ర అమోఘమని, పోలీసుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు శాఖ ఆధునీకరణకు కట్టుబడి ఉందని, రాష్ట్రవ్యాప్తంగా శిథిలావస్థలో ఉన్న పోలీస్ స్టేషన్ల స్థానంలో కొత్త భవనాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. కంఠేశ్వర్ ప్రాంత ప్రజలకు రూరల్ పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారికి భరోసా ఇచ్చేలా సిబ్బంది ప్రవర్తించాలని, త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని, శాంతిభద్రతలు సక్రమంగా ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మెన్ తాహెర్‌బిన్ హందాన్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ ముప్పగంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నగేష్‌రెడ్డి, నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, పోలీస్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రజలకు మరింత చేరువగా పోలీసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



