– గవర్నర్ జిష్టుదేవ్‌వర్మ
– మఠంపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. పాల్గొన్న మంత్రులు
నవతెలంగాణ-మఠంపల్లి
దేశంలో వ్యవసాయం వేగంగా అభివృద్ధి చెందుతోం దని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ అన్నారు. సూర్యాపేట జిల్లా మట్టపల్లికి శుక్రవారం గవర్నర్ సతీసమేతంగా వచ్చారు. శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ పూజారులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. ఆలయ రిజిస్టర్ లో గవర్నర్ సంతకం చేశారు.
అక్కడే వివిధ శాఖల అధికా రులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన శంకుస్థాపన శిలాఫల కాలను గవర్నర్ ఆవిష్కరించారు. కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్ అధ్యక్షతన బహిరంగ సభలో గవర్నర్ మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ కుమార్‌రెడ్డి పైలెటే కాదు.. గొప్ప ఫైటర్ అని, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల హృదయాల్లో నిలిచి, ప్రజల మనిషిగా ముందుకు సాగుతున్నారని అన్నారు. దేశంలో వ్యవసాయరంగం అభివృద్ధి చెందుతోం దని చెప్పారు. వ్యవసాయ కళాశాల, జవహర్ నవోదయ పాఠశాలకు శంకుస్థాపన చేయటం, శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడం మర్చిపోలేనిదన్నారు.
చుక్క నీరు వదలం : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కృష్ణా, గోదావరి జలాల నుంచి చుక్క నీరు కూడా వదలబోమని, నీటి వాటా హక్కులను తమ ప్రభుత్వం కాపాడుతుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. రూ.150 కోట్లతో 100 ఎకరాల్లో హుజూర్‌నగర్ సమీపంలోని మద్దూర్‌నగర్‌లో వ్యవసాయ కళాశాల, కోదాడలో రూ.50 కోట్లతో నిర్మించనున్న జవహర్ నవోదయ పాఠశాలలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. హుజూ ర్ నగర్‌లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభం రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయ కళాశాల మంజూరు చేశారని తెలిపారు.
ఆయిల్‌పామ్ సాగు చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రాష్ట్రంలో వరి ధాన్యం అత్యధికంగా పండిస్తు న్నారని, వరితోపాటు రెండేండ్లలో పది లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్‌ను సాగు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. వరి, ఆయిల్ పామ్ సాగులో దేశం లోనే అగ్రగామిగా నిలపాలన్నారు. అన్ని ఉమ్మడి జిల్లాల్లో వ్యవసాయ కళాశాలలు ఉండాలనే ఉద్దేశం తో నిజామాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు విద్యాలయాలు మంజూరు చేశామని తెలిపారు. ఈ సభలో మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కుం దూరు జయవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, ఉత్తమ్ పద్మావతి, ఎమ్మెల్సీ కేతవత్ శంకర్‌నాయక్, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ అల్తాస్ జానయ్య, కమిషనర్ సురేంద్ర మోహన్, ఎస్పీ నరసింహ, ఆర్డీవో శ్రీనివాసులు, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ గజ్జె చరమందరాజు, తహసీల్దార్ మంగా రాథోడ్, ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయకుమార్, సర్పంచ్ రామిశెట్టి విజయశాంతి అప్పారావు, మార్కెట్ కమిటీ చైర్మెన్ దేశముఖ్ రాధిక, డీఆర్‌డీఓ శిరీష పాల్గొన్నారు.
వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతోంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



