Friday, February 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుయూనస్ ప్రభుత్వంపై హసీనా ఫైర్..

యూనస్ ప్రభుత్వంపై హసీనా ఫైర్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం బంగ్లాదేశ్‌ను ‘హంతక అరాచకం’, ‘భయోత్పాత యుగం’లోకి నెట్టివేసిందని ఆమె ఆరోపించారు. భారత్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న ఆమె, న్యూఢిల్లీలోని ఫారెన్ కరస్పాండెంట్స్ క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ముందుగా రికార్డు చేసిన 10 నిమిషాల ఆడియో సందేశం ద్వారా ఈ వ్యాఖ్యలు చేశారు.

“ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న మా భూమి ఇప్పుడు గాయపడిన, రక్తసిక్తమైన ప్రదేశంగా మారింది. దేశం మొత్తం ఒక విశాలమైన జైలుగా, మరణశిక్షల క్షేత్రంగా, మృత్యులోయగా తయారైంది” అని హసీనా ఆవేదన వ్యక్తం చేశారు. యూనస్ ప్రభుత్వాన్ని ‘అక్రమ, హింసాత్మక’ యంత్రాంగంగా, ‘విదేశీ తొత్తు ప్రభుత్వం’గా ఆమె అభివర్ణించారు. దేశంలో ప్రజాస్వామ్యం ఖైదులో ఉందని, తనను ఓ కుట్ర ప్రకారం గద్దె దించారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె ఐదు డిమాండ్లు చేశారు. యూనస్ ప్రభుత్వాన్ని వెంటనే తొలగించాలని, గత ఏడాది జరిగిన ఘటనలపై ఐక్యరాజ్యసమితితో నిష్పక్షపాత విచారణ జరిపించాలని కోరారు. విమోచన యుద్ధ స్ఫూర్తితో దేశ ప్రజలంతా ఏకమై ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -