Thursday, April 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపాఠశాలలో విద్యార్థి కాల్పులు.. 9 మంది మృతి

పాఠశాలలో విద్యార్థి కాల్పులు.. 9 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టర్కీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ 14 ఏళ్ల విద్యార్థి తను చదువుకుంటున్న పాఠశాలలోనే విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది తోటి విద్యార్థులు, ఒక టీచర్ ప్రాణాలు కోల్పోయారు. అనంతరం నిందితుడైన విద్యార్థి కూడా మరణించాడు. నిన్న కహ్రామన్‌మరాస్ ప్రావిన్స్‌లోని అయ్సెర్ కాలిక్ మిడిల్ స్కూల్‌లో ఈ విషాదం జరిగింది. 8వ తరగతి చదువుతున్న ఇసా అరాస్ మెర్సిన్లీ అనే విద్యార్థి, తన తండ్రికి చెందిన ఐదు తుపాకులతో స్కూల్‌లోకి ప్రవేశించాడు. రెండు తరగతి గదుల్లోకి వెళ్లి కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 13 మంది విద్యార్థులు గాయపడగా, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రి ముస్తఫా సిఫ్త్సీ ధ్రువీకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -