- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో నిరుద్యోగులకు త్వరలోనే మరో భారీ నోటిఫికేషన్ రానుందని మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక లక్ష ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. వచ్చే నెలలో మరో 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మెదక్ (D) తూప్రాన్‌లో జరిగిన పార్టీ సమావేశంలో తెలిపారు. కొత్త రేషన్ కార్డుదారుల్లో అర్హులైన వారికి వచ్చే నెల నుంచి పెన్షన్ అందుతుందని తెలిపారు.
- Advertisement -



